మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం ‘MyMedaram’ పేరుతో ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించారు. 7658912300 నంబర్‌కు మెసేజ్ చేస్తే, రూట్ మ్యాపులు, మరుగుదొడ్ల స్థానాలు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు వంటి సమాచారం క్షణాల్లో అందుతుంది.
అలాగే హెల్ప్‌డెస్క్ వివరాలు, జాతర చరిత్ర, తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు, నీటి వసతి వంటి అనేక సేవలను కూడా ఈ చాట్‌బాట్ ద్వారా పొందవచ్చు. ఈ సేవలు వెబ్సైట్, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!