
.jpg&w=3840&q=75)
ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి మరింత ఊతమిస్తూ, తిరుపతి జిల్లాలోని MP-SEZలో వెబ్‌సోల్ సంస్థ భారీ పెట్టుబడితో సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.3,538 కోట్ల వ్యయంతో 8GW సామర్థ్యంతో కూడిన ఈ ఇంటిగ్రేటెడ్ సోలార్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో 4GW సోలార్ సెల్స్, 4GW సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.
రెండు దశల్లో మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుండగా, దాని ద్వారా సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే కాంప్లెక్స్‌కు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం 300 ఎకరాల్లో 100MW సామర్థ్యంతో క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!