

కృత్రిమ మేధస్సు దిశగా మార్పుల నేపథ్యంలో మెటా సంస్థ అమెరికాలో సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సిలికాన్ వ్యాలీలోని బర్లింగేమ్, సన్నీవేల్ కేంద్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వచ్చే నెలాఖరులోగా ఈ తొలగింపులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ఉద్యోగులను తగ్గించిన సంస్థ ఇప్పుడు మరింతగా కృత్రిమ మేధస్సుపై దృష్టి సారిస్తోంది.
ఇక సంస్థ నిర్మాణంలో కూడా మార్పులు చేపడుతూ సంప్రదాయ మధ్యస్థ మేనేజర్ పదవులను తగ్గించేందుకు మెటా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాటి స్థానంలో కొత్త బాధ్యతలతో కూడిన పదవులను ప్రవేశపెడుతోంది. దీని ద్వారా సంస్థలో నిర్ణయ ప్రక్రియ వేగవంతం అవడంతో పాటు సమర్థత పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త బాధ్యతల స్వరూపం పై అధికారిక స్పష్టత ఇంకా రాలేదు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!