
న్యూస్

హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని, రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ ఘటన స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్‌ప్రింట్ విశ్లేషణలో ఈ ల్యాబ్‌కు మంచి పేరు ఉంది. నేర విచారణల్లో కీలక పాత్ర పోషించే ఈ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల కీలక పరికరాలు, ఆధారాలకు నష్టం జరిగిందా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!