
టెక్నాలజీ
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో బుధవారం పోలీసుల ఎదుట 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా దర్బా, కేరళపాల్ ఏరియా కమిటీలకు చెందిన సభ్యులని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఈ లొంగుబాటుతో కేరళపాల్ ఏరియా కమిటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు ఆయన వెల్లడించారు.
లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సహాయం కింద నగదు, పునరావాస సదుపాయాలు కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. సుకుమా జిల్లాలో నక్సల్స్ కార్యకలాపాలు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామం జిల్లాలో శాంతి భద్రతల పునరుద్ధరణకు కీలక మలుపుగా భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!