
రాజకీయాలు

మహారాష్ట్రలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై నుంచి సోలాపూర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ పుణే రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఘటన సమయంలో రైలు తక్కువ వేగంతో ప్రయాణిస్తుండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురైనా అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, స్టేషన్ సమీపంలోని డైమండ్ క్రాసింగ్ వద్ద తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఘటన అనంతరం ఇంజనీరింగ్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని పట్టాలు తప్పిన బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించే పనులు చేపట్టాయి. ఈ ఘటనతో పుణే మీదుగా వెళ్లే కొన్ని రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది









4225-1768468351.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!