

లెనిన్ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమా విడుదల ఇప్పటికే ఒకసారి వాయిదా పడగా, ఇప్పుడు రీషూట్ వార్తలతో మరింత చర్చకు వచ్చింది. జూన్ 26న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజా పరిణామాలు చూస్తుంటే ఆ తేదీకి సినిమా రావడం కష్టమేనని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
సినిమా నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పలు మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలు ఆశించిన స్థాయిలో రాలేదని భావించిన అఖిల్, వాటిని మళ్లీ చిత్రీకరించాలని సూచించాడని ప్రచారం ఉంది. దీంతో మేకర్స్ కూడా రీషూట్కు సిద్ధమయ్యారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, నాగార్జున మరియు నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ ఉంది. రీషూట్ పూర్తయ్యాక సినిమా మరింత మెరుగైన రూపంలో వస్తుందని భావిస్తున్నారు. కొత్త విడుదల తేదీపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!