
గాసిప్స్

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెహ్రూ చౌక్ సెంటర్లోని అద్దేపల్లి కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత సెల్‌ఫోన్ దుకాణంలో ప్రారంభమైన మంటలు క్రమంగా ఇతర షాపులకు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
అదే కాంప్లెక్స్‌లో జూనియర్ కళాశాల, ఎస్బీఐ శాఖలు ఉండటంతో ఘటన తీవ్రత పెరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.కోటి మేర ఆస్తి నష్టం జరిగినట్లు జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి ఆంజనేయులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!