
టెక్నాలజీ

వరంగల్ జిల్లాలోని మేడారంలో ప్రపంచ ప్రఖ్యాత మహా జాతర ప్రారంభమైంది. వన దేవతలైన సమ్మక్క – సారలమ్మల దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.251 కోట్లతో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టింది.
జాతరలో భాగంగా నేడు సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలపైకి రానుండగా, రేపు చిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారం చేరుకోనున్నారు. ఈ నెల 30 న అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనుండగా, 31 న దేవతల వన ప్రవేశంతో మహా జాతర ముగియనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!