

ఫుట్‌బాల్ ప్రేమికులకు సంతోషకరమైన వార్త. ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సి త్వరలో హైదరాబాద్‌కి రానున్నారు. భారత్‌లో ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించే గోట్ టూర్ లో భాగంగా ఆయన డిసెంబర్ 13 న సాయంత్రం 7 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ టూర్లో మెస్సి:
7 vs 7 సెలబ్రిటీ మ్యాచ్‌లో ఆడతారు
యువ ఆటగాళ్లకు ఫుట్‌బాల్ క్లాస్ ఇస్తారు
పెనాల్టీ షూటౌట్లలో పాల్గొంటారు
కార్యక్రమం చివరగా సంగీత ప్రదర్శన కూడా ఉంటుంది. టికెట్లు త్వరలో District App ద్వారా అందుబాటులోకి వస్తాయి.
ఈ టూర్‌ను సతద్రు దత్తా నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో మారడోనా (2017), పీలే (2015) లను భారతదేశానికి తీసుకువచ్చారు.
ఇక, తెలంగాణ ప్రభుత్వం మెస్సిని ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!