
సినిమాలు

హెచ్‌సీఏలో వెలుగులోకి వచ్చిన ఆర్థిక అవకతవకలు, బీసీసీఐ నిధుల దుర్వినియోగ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించారు. హెచ్‌సీఏకు సంబంధించిన నాలుగు కేసులను సిట్‌కు బదిలీ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
గతంలో నమోదైన కేసులతో పాటు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫిర్యాదులపై కూడా సిట్ సమగ్ర విచారణ చేపట్టనుంది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు ఇప్పటికే తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు, కార్యదర్శిని సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజా సిట్ విచారణతో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!