

జల్లికట్టు ఉద్యమం ద్వారా గుర్తింపు పొందిన బుల్లితెర నటి జూలీ, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల రాజకీయంగా విజయ్‌ను విమర్శించిన అనంతరం సోషల్ మీడియాలో తనపై విస్తృత స్థాయిలో ట్రోలింగ్ జరిగిందని, ఆ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని ఆమె పేర్కొన్నారు.
అదేవిధంగా తనపై రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు చేస్తూ వివిధ కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జూలీ ఆరోపించారు. నిరంతర మానసిక ఒత్తిడి కారణంగా గర్భస్రావం జరిగిందని ఆమె వాదించారు. విజయ్‌కు ప్రత్యక్ష ప్రమేయం లేదని చెప్పినప్పటికీ, తనను లక్ష్యంగా చేసుకున్న ట్రోలింగ్‌ను అరికట్టేందుకు ఆయన స్పందించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆరోపణలపై విజయ్ లేదా ఆయన పార్టీ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!