

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో చేసిన వ్యాఖ్యలకు ముందుగా క్షమాపణలు చెప్పిన తర్వాతే హైదరాబాద్‌లో నవ నిర్మాణ సభ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ప్రత్యేక రాజకీయ సభ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణపై గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మంత్రి, తెలంగాణలో విద్వేష రాజకీయాలకు తావులేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు సోదరభావ సంబంధాలు ఉన్నాయని, ఇతర రాష్ట్రాలను గౌరవించడం తమ సంస్కృతి అని పేర్కొన్నారు. అయితే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ప్రజలు సహించరని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!