

ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన బెంగళూరు జట్టు మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. విజయం అనంతరం ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
అయితే విజయోత్సాహంలో అభిమానులు బాధ్యతగా వ్యవహరించాలని ఆర్సీబీ ప్రత్యేకంగా కోరింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి సురక్షితంగా విజయాన్ని ఆస్వాదించాలని సూచించింది. గత ఏడాది బెంగళూరులో జరిగిన విజయోత్సవాల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మృతి చెందిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి అధికారిక విజయ ర్యాలీ నిర్వహించే ఆలోచన లేదని సంకేతాలు ఇచ్చింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అభిమానుల సంబరాలు ట్రాఫిక్ అంతరాయాలు, ఆస్తుల ధ్వంసానికి దారితీయడంతో ప్రజా భద్రతకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!