
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కోయంబత్తూరులో “నిర్భయమైన మనస్సుకు పరిమితులు ఉండవు” అనే నినాదంతో ఆయన ఫొటోతో కూడిన పోస్టర్లు వెలవడం ఈ చర్చకు మరింత ఊపునిచ్చింది. అన్నామలై అన్బు కూట్టం పేరుతో ఆయన మద్దతుదారులు సభ్యత్వ విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అన్నామలైపై రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ట్వీట్ కూడా తమిళనాడులో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందన్న ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయితే ఈ ప్రచారాలపై అన్నామలై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!