
న్యూస్

కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంపై కొత్త వివరాలు వెలుగుచూశాయి. మంటల్లో దగ్ధమైన v కావేరి ట్రావెల్స్ బస్సుపై 16 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. మొత్తం రూ.23 వేల జరిమానాలు కూడా ఉన్నాయి.ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనల కారణంగా ఈ ఫైన్లు విధించబడ్డాయి. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఈ జరిమానాలే నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.ఈ బస్సును 2018లో కొనుగోలు చేసి, మొదట డామన్ అండ్ డయూలో రిజిస్టర్ చేశారు. తర్వాత 2025లో ఒడిశాలో రీ-రిజిస్ట్రేషన్ చేశారు. బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్‌గా గుర్తించారు.
పలుమార్లు ఫైన్లతో ఉన్న ఈ బస్సు ఎలా రోడ్డుపై నడవడానికి అనుమతించారనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!