
రాజకీయాలు

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని శక్తి జిల్లా సింగితరాయ్లో ఉన్న వేదాంత లిమిటెడ్ విద్యుత్ కేంద్రంలో నిన్న బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం సమయంలో బాయిలర్ ట్యూబ్లో పేలుడు చోటు చేసుకోవడంతో కేంద్రంలో భారీ విధ్వంసం జరిగింది.
సంఘటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!