
గాసిప్స్
_imgupscaler.ai_V1(Fast)_2K.png&w=3840&q=75)
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు , మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB)లో ప్రభాకర్ రావును ఓఎస్డీగా ఎలా నియమించారనే అంశంపై సిట్ విచారణ చేపట్టనుంది.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో, ప్రభాకర్ రావు ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఇచ్చారనే అంశంపై నవీన్ చంద్‌ను సిట్ ప్రశ్నించనుంది. నవీన్ చంద్ హయాంలోనే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా పని చేసిన విషయం గమనార్హం. ఈ వ్యవహారంలో నిర్ణయాలు ఎలా తీసుకున్నారనే దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత తీసుకురావడమే సిట్ విచారణ లక్ష్యంగా ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!