
న్యూస్

ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి నేడు ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసును న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం విచారించనుంది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, కవిత సహా నిందితులపై నమోదైన అభియోగాలను రౌజ్ అవెన్యూ న్యాయస్థానం గతంలో కొట్టివేసింది. ఆ తీర్పును కేంద్ర దర్యాప్తు సంస్థ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్, కవిత సహా ప్రతివాదులందరికీ నేడు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం నుండి విచారణను మార్చాలని అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. దాంతో బెంచ్ మార్పు కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!