
బెంగళూరులోని థియో కేఫేలో ఇచ్చిన ఒక బిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆ బిల్లులో “గ్యాస్ క్రైసిస్ ఛార్జ్” అనే అదనపు ఛార్జ్ కనిపించడంతో కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2026 నిన్న ఇచ్చిన ఈ బిల్లులో రెండు మింట్ లెమొనేడ్‌లు ఒక్కొక్కటి ₹179 చొప్పున తీసుకున్నట్లు ఉంది. దీంతో మొత్తం సబ్‌టోటల్ ₹358 అయ్యింది. దీనిపై సాధారణంగా ఉండే CGST, SGST (2.5 శాతం చొప్పున)తో పాటు అదనంగా ఐదు శాతం “గ్యాస్ క్రైసిస్ ఛార్జ్”గా ₹17.01 చేర్చినట్లు బిల్లులో కనిపిస్తోంది.
ఈ అదనపు ఛార్జ్‌పై వినియోగదారుల మధ్య చర్చ మొదలైంది. వంట గ్యాస్ ధరలు పెరగడం వల్ల కొన్ని రెస్టారెంట్లు అదనపు ఛార్జ్‌లు వేయవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే అలాంటి ఛార్జ్‌ల గురించి ముందుగానే కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఈ కేఫే బిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రెస్టారెంట్ బిల్లింగ్ విధానాలపై చర్చకు కారణమైంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!