

రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని ఆరోపిస్తూ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. స్పీకర్ ఇప్పటికే పది అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ అన్ని కేసుల్లో తీర్పులు ఇచ్చారని, ఇక ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్పీకర్ ఇచ్చిన తీర్పులను అధికారికంగా నోటిఫై చేయలేదని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు శుక్రవారంలోగా స్పీకర్ ఉత్తర్వులను అధికారికంగా ప్రచురించాలని, అనంతరం నాలుగు రోజుల్లో పిటిషనర్లకు అవసరమైన పత్రాలను అందించాలని ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!