

ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీఆర్ఎస్ తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోయిందని ఆయన ఆరోపించారు. అందుకే ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ బీజేపీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని చెప్పారు.
రైతుల సమస్యలు, రైతు భరోసా అమలు కాకపోవడం, పేదల ఇళ్ల కూల్చివేత వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై కూడా సమాధానం ఇవ్వాలని కోరారు. సబర్మతి నది అభివృద్ధికి అక్కడి ప్రజలే ముందుకు వచ్చారని, కానీ హైదరాబాద్లో మూసీ నది అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని, డ్రగ్స్ సులభంగా దొరుకుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!