

ప్రతిష్ఠాత్మక 98 వ అకాడమీ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్ నగరంలోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగింది. ఈ ఏడాది వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ సినిమా మొత్తం ఆరు విభాగాల్లో అవార్డులు గెలుచుకొని ఈసారి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పదహారు నామినేషన్లు పొందిన సిన్నర్స్ చిత్రం నాలుగు అవార్డులతో సరిపెట్టుకుంది.
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి దర్శకత్వం వహించిన పాల్ థామస్ అండర్సన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. అదే చిత్రానికి ఉత్తమ అనువాద కథా రచన విభాగంలో కూడా ఆయనకు అవార్డు లభించింది. ఈ చిత్రంలో సహాయ నటుడిగా నటించిన సీన్ పెన్ అవార్డు అందుకున్నారు. మరోవైపు సిన్నర్స్ చిత్రానికి మైఖేల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. హామ్నెట్ చిత్రానికి జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వ్యాఖ్యాతగా కోనన్ ఓబ్రియన్ వ్యవహరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!