

దేశంలో వాణిజ్య గ్యాస్ కొరత కారణంగా ఐటీ కంపెనీల కార్యాలయ క్యాంటీన్ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. దీంతో ఉద్యోగులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని కంపెనీలు సూచిస్తున్నాయి. కొన్నిచోట్ల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. HCLTech చెన్నై కార్యాలయంలో క్యాంటీన్ వెండర్లు సేవలు నిలిపివేయడంతో మార్చి 12, 13 తేదీల్లో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అనుమతి ఇచ్చినట్లు కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇక Infosys బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లో ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. గ్యాస్ కొరత కారణంగా క్యాంటీన్లలో పరిమితమైన ఆహార పదార్థాలే లభిస్తాయని తెలిపింది. లైవ్ ఫుడ్ కౌంటర్లను తాత్కాలికంగా నిలిపివేసి, ఉద్యోగులు ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవాలని సూచించింది. ఇదే సమయంలో Wells Fargo ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కట్టకం కంపెనీలు బాధ్యతాయుతంగా స్పందించి సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలని సూచించారు. ఉద్యోగుల ప్రయాణాలను తగ్గించడం ద్వారా ఆదా అయ్యే ఇంధనాన్ని ఆరోగ్య సేవలు, లాజిస్టిక్స్, ప్రజా రవాణా వంటి కీలక రంగాలకు మళ్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!