.jpg&w=3840&q=75)

తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు చేసింది. ముఖ్యంగా TDR (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) వినియోగం పై కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇప్పటి నుంచి 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హై రైజ్‌గా పరిగణిస్తారు. 750 నుండి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు ఉన్న భవనాలకు TDR తప్పనిసరి చేశారు. నాన్ హై రైజ్ భవనాలకు సెట్‌బ్యాక్ విషయంలో కొంత సడలింపు ఇచ్చారు. అలాగే హై రైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ తగ్గించుకునే అవకాశం కల్పించారు.
2000 చదరపు మీటర్లకు పైగా ఉన్న ప్లాట్లలో అదనపు అంతస్తులు నిర్మించడానికి అనుమతి ఉంటుంది. రోడ్డు వెడల్పు ఆధారంగా అదనపు అంతస్తుల సంఖ్యను నిర్ణయించారు. 40 అడుగుల రోడ్ వద్ద 3 అంతస్తులు, 60 అడుగుల రోడ్ వద్ద 4 అంతస్తులు, 80 అడుగుల రోడ్ వద్ద 5 అంతస్తులు అదనంగా నిర్మించుకోవచ్చు. 10 అంతస్తులకు పైగా ఉన్న భవనాల్లో TDR వినియోగం తప్పనిసరి. 20 అంతస్తులకు పైగా ఉన్న భవనాలకు 5 శాతం TDR లోడింగ్ అమలు చేస్తారు.
బిల్డింగ్ అనుమతి తీసుకునే సమయంలో 50 శాతం TDR సమర్పించాలి. మిగిలిన 50 శాతం TDR ను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే ముందు తప్పనిసరిగా సమర్పించాలి.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!