

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన సేవలను మరింత సులభతరం చేయడానికి వాట్సప్ ఆధారిత సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని ప్రకటించారు. వాట్సప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలను తెలుసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. యూఏఎన్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా ఈ సేవలు పొందవచ్చని తెలిపారు.
గ్రీన్ టిక్ కలిగిన అధికారిక ఈపీఎఫ్ఓ వాట్సప్ నంబర్‌కు “హలో” మెసేజ్ పంపడం ద్వారా 24/7 ఆటోమేటెడ్ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. స్థానిక భాషల్లో కూడా సేవలు అందనున్నాయి. అలాగే యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. యూపీఐ పిన్ ద్వారా సురక్షితంగా నగదు ఉపసంహరణ చేసుకునే విధానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!