
జనరల్

హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంతలక్ష్మికుమార్పై అక్రమాస్తుల ఆరోపణలతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం అనంతలక్ష్మికుమార్ రెడ్ హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 జీఎంగా విధులు నిర్వహిస్తున్నారు.
సోదాల్లో రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన అధికార వర్గాల్లో సంచలనం రేపగా, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!