
జనరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ గ్లింప్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. మోకాళ్లపై కూర్చొని, చేతిలో గొడ్డలి పట్టుకుని మంటల మధ్య కనిపించిన ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆయన ‘లూగర్’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ భారీగా బరువు తగ్గడంపై వచ్చిన చర్చలకు దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించారు. కథ కోసం ఎన్టీఆర్ స్వయంగా తీవ్రంగా శ్రమించి 15 కిలోల వరకు తగ్గారని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా పాత్ర అవసరానికి అనుగుణంగా జరిగిన మార్పు అని స్పష్టం చేశారు. ఈ చిత్రం అనిల్ కపూర్, రుక్మిణీ వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!