
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్ష నిర్వహణ, భద్రతా చర్యలు, పారదర్శకత, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. రీ-ఎగ్జామ్ ప్రక్రియను పూర్తిగా నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు.
పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి ఉండాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గత పరీక్ష నిర్వహణలో గుర్తించిన లోపాలను పూర్తిగా సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!