
జనరల్

కాళేశ్వరం వద్ద సరస్వతీ అంత్య పుష్కరాలు నేడే ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 1 వరకు 12 రోజులపాటు జరగనున్నాయి. కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలి పుష్కర స్నానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లక్షలాది భక్తులు హాజరయ్యే అవకాశంతో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
పుష్కరాల కోసం ఘాట్ ప్రాంతంలో చలువ పందిళ్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, సీసీ కెమెరాలు, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 245 ఎకరాల్లో భారీ పార్కింగ్, 300 మంది వైద్య సిబ్బంది, 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు. భక్తుల భద్రత కోసం రెస్క్యూ బృందాలు, బోట్లు, ప్రత్యేక లైటింగ్ వ్యవస్థలు సిద్ధం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!