

మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల స్థలం వాగ్దేవి ఆలయానిదేనని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి మాత సరస్వతి విగ్రహాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి స్థానిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విగ్రహం తమకు కోహినూర్ కంటే ఎంతో ముఖ్యమని, ఇది మత విశ్వాసం, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హిందూ సంఘాలు లేఖ రాశాయి. కేంద్రం దౌత్యపరమైన చర్యలు ప్రారంభిస్తే విగ్రహాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావడం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. చారిత్రక ఆధారాల ప్రకారం రాజ్‌పుత్‌లకు చెందిన పర్మార్ వంశ రాజు భోజ్ 1034లో ఈ సరస్వతి ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అనంతరం 1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర సమయంలో ఆలయం ధ్వంసమైనట్లు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!