

హైదరాబాద్కు చెందిన అజా కన్సల్టింగ్ సర్వీసెస్ తమ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారితే నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించింది. ఈవీ కార్లు కొనుగోలు చేసే వారికి రూ.10,000, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు సంస్థ సీఈఓ ఫణిరాజ్ జలిగామ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పర్యావరణ హిత పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థ ‘గ్రీన్ పాలసీ’ని అమలు చేస్తోంది. కార్ పూలింగ్, ప్రజా రవాణా వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. ఇంధన వినియోగం తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలకు మేలు జరుగుతుందని సంస్థ అభిప్రాయపడింది.
ప్రపంచ ఇంధన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారాలని ప్రధాని సూచించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సంస్థ వివరించింది. ఉద్యోగులు సుస్థిర రవాణా మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించడం తమ లక్ష్యమని అజా కన్సల్టింగ్ తెలిపింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!