
జనరల్

ఇండియన్ సినిమా హిస్టరీలో గుర్తుండిపోయే పాత్ర ‘జార్జ్‌కుట్టి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దృశ్యం 3’ భారీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది.
లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారతదేశంలోనే భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదవ్వగా, కేరళలో అభిమానుల స్పందన అత్యధికంగా ఉంది.
సిరీస్‌లో గత భాగాలు సృష్టించిన సంచలనం నేపథ్యంలో ‘దృశ్యం 3’పై అంచనాలు మరింత పెరిగాయి. జార్జ్‌కుట్టి జీవితంలో కొత్త మలుపులు, మరింత తీవ్రమైన ఇన్వెస్టిగేషన్ ఈ భాగంలో ఉండబోతున్నాయని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!