

భారతి ఎయిర్టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. 5జీ నెట్వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ సేవల ద్వారా అంతరాయం లేని, నమ్మకమైన కనెక్టివిటీ అందుతుందని కంపెనీ తెలిపింది. ఈ తరహా ప్రాధాన్య 5జీ సేవలను ప్రారంభించిన తొలి టెలికాం సంస్థల్లో ఎయిర్టెల్ ఒకటిగా నిలిచింది.
రూ.449 నుంచి ప్రారంభమయ్యే అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు ఈ ప్రయారిటీ సేవలు అందుబాటులో ఉంటాయని ఎయిర్టెల్ వెల్లడించింది. అపరిమిత కాల్స్, డేటా, 3000 ఎస్సెమ్మెస్‌లు, ఫ్రాడ్ డిటెక్షన్, స్పామ్ అలర్ట్స్ వంటి ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. ఇప్పటికే పోస్ట్‌పెయిడ్ వినియోగదారులుగా ఉన్నవారికి ఈ సేవలు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయని, ఇతరులు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లేదా స్టోర్ల ద్వారా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని తెలిపింది. రద్దీ సమయాల్లో కూడా స్థిరమైన నెట్వర్క్ అనుభవం అందించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యమని కంపెనీ పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!