

కేరళ వేదికగా జరిగిన ఆర్గాన్ ట్రాఫికింగ్(Organ trafficking) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ముఠా ఇరాన్‌తో పాటు తజికిస్థాన్‌కు కూడా అక్రమంగా మనుషులను తరలించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అవయవ దానం కోసం తజికిస్థాన్‌కు పంపినట్టు NIA గుర్తించింది. ఈ వివరాలు ప్రధాన నిందితుడు మధు జయకుమార్ కస్టడీ కోసం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొని ఉంది.
2024 మే 18 న కొచ్చి విమానాశ్రయంలో సాబిత్ అనే వ్యక్తిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో ఈ వ్యవస్థీకృత నేరం బయటపడింది. అమాయకులను మోసం చేసి విదేశాలకు పంపి అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇతర రాష్ట్రాల లింకులు, అలాగే ఈ దందాలో ఉన్న మరికొంతమంది కీలక వ్యక్తులను పట్టుకునేందుకు NIA లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!