
%20(1).png&w=3840&q=75)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా ప్రజాజీవితాన్ని ప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా ఎదిగి పలు కీలక హోదాల్లో సేవలందించిన అజిత్ పవార్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.
ఈ విషాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణం ప్రజాజీవితానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మరియు అక్కడి ప్రజలకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో శోకసంతప్త కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని సీఎం ప్రార్థించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!