.png&w=3840&q=75)

మల్లన్నసాగర్ రిజర్వాయర్ వంటి రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు దీర్ఘకాల న్యాయపోరాటం తర్వాత ఊరట లభించింది. ఒంటరి మహిళలు, పురుషులు పునరావాసం మరియు పునర్నిర్మాణ పథకం కింద పరిహారం పొందారు. బుధవారం విచారణ జరగాల్సి ఉండగా, మంగళవారమే ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది. బాధితులు ప్రత్యేకంగా గుర్తించి రూ.12.50 లక్షల పరిహారం, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.
అయితే తెలంగాణ హైకోర్టు ఇంకా వడ్డీ చెల్లింపు, ఇంటి స్థలం కేటాయింపు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హాజరుకాకపోవడంపై కూడా ప్రశ్నించింది. పరిహారం పంపిణీ జరిగినప్పటికీ కేసును ముగించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది. మొత్తం 79 మంది పిటిషనర్లలో సగం మందికే పరిహారం అందగా, మిగతావారు మరణించడం గమనార్హం.










.png&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!