
గాసిప్స్

హైదరాబాద్ మహానగర పాలనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియడంతో, కార్పొరేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిగా , స్పెషల్ సీఎస్ 1992 బ్చాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ను ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పరిపాలనా మార్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జయేష్ రంజన్ నేటి నుంచే బాధ్యతలు స్వీకరించి, నగర అభివృద్ధి మరియు పాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!