

పార్లమెంట్‌లో ట్రాన్స్‌జెండర్ల హక్కుల సవరణ బిల్లు-2026 ఆమోదం పొందిన వేళ రాజ్యసభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ బిల్లుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతుండగా.. ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు అశాస్త్రీయంగా ఉందని, ఇవి ట్రాన్స్‌జెండర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని జయా మండిపడ్డారు. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ పొందాలనే నిబంధనను ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. స్వయంగా తమ జెండర్‌ను ప్రకటించుకునే హక్కును కాలరాయడం అనేది చాలా అన్యాయమని, రామాయణ కాలం నుంచి గౌరవించబడుతున్న ఈ సమాజాన్ని ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోందని ఆమె సూటిగా ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్ల సమస్యలు నిజంగా తీరాలంటే వారి వర్గం నుంచే ఒకరిని పార్లమెంట్‌కు నామినేట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు చర్చా సమయంలో అధికార పక్ష సభ్యులు పదేపదే అంతరాయం కలిగించడంతో జయా బచ్చన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అంతరాయం కలిగిస్తున్న సభ్యులను ఉద్దేశించి పిల్లలూ.. కూర్చోండి అంటూ గట్టిగా వారించడంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.


.png&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!