
సినిమాలు

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో అతడిపై రెండేళ్ల నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ సీజన్‌లో ఆడాల్సిన డకెట్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లాండ్ తరఫున రాబోయే టెస్టు సిరీస్‌లకు సిద్ధం కావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం వేలంలో ఎంపికై తర్వాత టోర్నీ నుంచి తప్పుకుంటే ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధిస్తారు. గాయం లేదా వైద్య కారణాలు తప్ప ఇతర కారణాలకు మినహాయింపు ఉండదు. దీంతో డకెట్ 2027, 2028 సీజన్లలో ఐపీఎల్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.







.webp&w=3840&q=75)









.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!