

పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్ బ్యానర్ల పై టి. మల్లేశ్వరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ నిర్మాతలుగా, శివఝాన్సీరేగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం బర్బరీకుడు తాజాగా ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు.
మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషించిన యోధుడు బర్బరీకుడి కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కథ ద్వారా ప్రేక్షకులకు ఒక కొత్త కోణాన్ని చూపించాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. దర్శకుడు శివఝాన్సీరేగాల గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, పాటల రచయితగా అనుభవం సంపాదించి, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహాభారతం వంటి మహత్తర ఇతిహాసంలో తక్కువగా తెలిసిన పాత్రను తెరపైకి తీసుకురావడం అభినందనీయమని చెప్పాలి.
ఈ చిత్రంలో రామ్-లక్ష్మణ్ శిష్యుడు, స్టంట్ మాస్టర్ బద్రి మాస్టర్ అల్లుడు కృష్ణ భారత హీరోగా పరిచయం అవుతున్నారు. విలక్షణ నటుడు రవిశంకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సమ్మెట గాంధీ, జబర్దస్త్ చిట్టిబాబు, ఆనంద్ భారతి తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శ్యామ్ కె నాయుడు అందిస్తుండగా, ఎడిటింగ్‌ను కార్తీక్ శ్రీనివాస్ చేస్తున్నారు. సంగీతాన్ని జి.ఎం సతీష్ అందిస్తున్నారు. డాన్స్ కొరియోగ్రఫీని భాను మాస్టర్ నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. బర్బరీకుడు కథ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
.avif&w=3840&q=75)

















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!