
గాసిప్స్

దేశవ్యాప్తంగా 2029లో జరిగే జమిలి ఎన్నికలతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్ల రాష్ట్ర అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, తన పదవీకాలం ఐదేళ్లకు బదులుగా సుమారు ఐదున్నరేళ్లు ఉండే అవకాశముందని పేర్కొన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం 2027 నాటికి జనగణన పూర్తి చేసి, అనంతరం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడుతుందని వివరించారు.
జనాభా లెక్కలు విడుదలైన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ఖరారయ్యే అవకాశం ఉందని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త నియోజకవర్గాల ఆధారంగా 2029లో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించబడతాయని ఆయన వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!