

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. భారత భూమి నుంచి ఇప్పటివరకు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి, కక్ష్యలో ప్రవేశపెట్టింది.
4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్వీఎం3-ఎం5 బాహుబలి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. ఈ రాకెట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ఉంచింది.
సీఎంఎస్-03 పేరుతో రూపొందించిన ఈ మల్టీ-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం భారత భూభాగం సహా విస్తృత సముద్ర ప్రాంతాల్లో సేవలు అందిస్తుంది. ఇది 2013లో ప్రయోగించిన జీఎస్ఏటీ-7 సిరీస్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది మరియు వచ్చే 15 సంవత్సరాలపాటు సేవలు అందించనుంది.
ఈ విజయవంతమైన ప్రయోగం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప ఉదాహరణగా నిలిచింది. అనుకూలం కాని వాతావరణ పరిస్థితుల మధ్య కూడా శాస్త్రవేత్తలు ఎలాంటి అంతరాయం లేకుండా రాకెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించారు. ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఈ విజయానికి వెనుక ఉన్న బృందాన్ని అభినందించారు.
ఇక దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇస్రో విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. “బరువైన మరియు శక్తివంతమైన రాకెట్‌కు బాహుబలి అనే పేరు రావడం మాకు గర్వకారణం” అని తెలిపారు.











కామెంట్స్ (2)
ఇస్రో మరోసారి భారత గర్వకారణమైంది
Proud moment for India’s space program