

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ Indian Space Research Organisation చైర్మన్ డా. వి. నారాయణన్ ఇవాళ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ను దర్శించుకున్నారు. కీలక అంతరిక్ష ప్రయోగాలకు ముందు శ్రీవారి ఆశీస్సులు కోరుకోవడం ఇస్రోలో సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 24 న జరగనున్న ప్రధాన లాంచ్ విజయవంతం కావాలని ప్రార్థించినట్లు సమాచారం.
ఈ నెల 24 వ తేదీ ఉదయం 8:54 గంటలకు శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్ LVM3-M6 ద్వారా అమెరికాకు చెందిన AST SpaceMobile సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ ఉపగ్రహం భారత్ నుంచి ఇప్పటివరకు లో ఎర్త్ ఆర్బిట్ (LEO) లోకి పంపనున్న అత్యంత బరువైన వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహంగా రికార్డు సృష్టించనుంది. దాదాపు 223 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన భారీ ఫేజ్డ్ అరే ఆంటెన్నాతో ఇది రూపొందించబడింది.
ఈ ఉపగ్రహం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాధారణ స్మార్ట్ఫోన్లకే నేరుగా 4జీ, 5జీ సిగ్నల్స్ అందించనున్నారు. దీని వలన దూర ప్రాంతాలు, సముద్రాలు, ఎడారులు వంటి నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కూడా హైస్పీడ్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, వీడియో స్ట్రీమింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి మరో కీలక మైలురాయిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!