

భారత్ మరియు జపాన్ కలిసి చంద్రయాన్–5 మిషన్‌ను రూపుదిద్దేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై రెండు దేశాలు పలు స్థాయిల్లో చర్చలు జరిపాయి. ఈ క్రమంలో, జపాన్ జాతీయ అంతరిక్ష విధాన కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సాకు సునేటా నేతృత్వంలోని బృందం రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది.
ఈ సందర్భంగా డాక్టర్ సునేటా బృందం, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్‌తో సమావేశమై రెండు దేశాలు సంయుక్తంగా చేపట్టబోయే చంద్రయాన్–5 మిషన్‌పై విస్తృతంగా చర్చించారు. మిషన్ ప్రణాళికలు, సంయుక్త సహకారం, సాంకేతిక సమన్వయం వంటి కీలక అంశాలను సమీక్షించినట్లు సమాచారం.
తరువాత జపాన్ ప్రతినిధుల బృందం యూఆర్ రావు ఉపగ్రహ తయారీ కేంద్రాన్ని సందర్శించింది. అనంతరం, అక్కడే ఉన్న ఇస్రో శాటిలైట్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ (ISITE) కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ రెండు కేంద్రాల్లో లభ్యమయ్యే ఆధునిక సాంకేతిక సదుపాయాల గురించి ప్రతినిధుల బృందానికి ఇస్రో అధికారులు వివరించినట్లు సంస్థ వెల్లడించింది.
ఇరు దేశాలు కలిసి చంద్రయాన్–5 ను విజయవంతం చేసేందుకు మరింత సన్నిహితంగా పనిచేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు ఇస్రో తమ అధికారిక వెబ్సైట్లో తెలిపింది.











కామెంట్స్ (1)
సాంకేతిక సహకారంలో పెద్ద ముందడుగు