

ఇరాన్‌తో కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మూడు వేర్వేరు రూపాల్లో 10 పాయింట్ల ప్రతిపాదనలు పంపిందని, వాటిలో ఒకటి చాట్‌జీపీటీ రాసినట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఈ మూడు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని పేర్కొన్నారు. మొదట పంపిన ప్రతిపాదనను అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్ మరియు జారెడ్ కుష్నర్ పరిశీలించి వెంటనే తిరస్కరించినట్లు వెల్లడించారు. రెండో వర్షన్‌ను కాల్పుల విరమణ ప్రకటనలో డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారని చెప్పారు. మూడో ప్రతిపాదన మొదటి దానికంటే మరింత కఠినంగా, అంగీకరించలేని డిమాండ్లతో ఉందని, అది సోషల్ మీడియా ద్వారా తెలిసిందని ఆయన వివరించారు. అలాగే లెబనాన్ కారణంగా కాల్పుల విరమణ విఫలం కాకుండా చూడాలని ఇరాన్‌ను కోరారు. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఎలాంటి నిబంధనలు చేర్చలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్ వేదికగా అమెరికా–ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు ఈ శనివారం ప్రారంభం కానున్నాయి. జేడీ వాన్స్ నేతృత్వంలో అమెరికా ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొననుంది. ఈ సమావేశాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!