
సినిమాలు
.png&w=3840&q=75)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పునర్విభజన బిల్లుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు రాష్ట్ర ఉనికికే ముప్పు కలిగించేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇచ్చే హామీలపై తాము విశ్వాసం పెట్టలేమని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగ సవరణ పేరుతో రాష్ట్రాల హక్కులను హరించే కొత్త కుట్రలు జరుగుతున్నాయని స్టాలిన్ ఆరోపించారు. మాటల హామీలు సరిపోవని, చట్టసభల్లోనే రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కమిషన్‌కు కేంద్రం అపరిమిత అధికారాలు కట్టబెట్టిందని, దాని ద్వారా కొన్ని రాష్ట్రాల్లో సీట్లను రాజకీయ ప్రయోజనాల కోసం పెంచుకునే అవకాశం కల్పించుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇది దేశ ప్రయోజనం కాదని, పూర్తిగా రాజకీయ వ్యూహమేనని ఆయన పేర్కొన్నారు.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!