
రాజకీయాలు

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వాన పడగా, సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, పారడైజ్, మారేడుపల్లి ప్రాంతాల్లో వడగండ్ల వాన నమోదైంది. ఈ వర్షంతో నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గి కొంత ఉపశమనం లభించింది.
వాతావరణ శాఖ ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు మరికొన్ని గంటలు కొనసాగుతాయని హెచ్చరించింది. చింతల్, పద్మనగర్ ప్రాంతాల్లో భారీ వృక్షం కూలి విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా వాహనాలు నాశనమయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
.jpeg&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!