

కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చోటు దక్కింది. 21 ఏళ్ల పేరాల అమన్ రావును మంగళవారం జరిగిన వేలంలో రూ.30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంపిక చేసింది. ఇది ఆయన క్రీడా ప్రయాణంలో కీలక ఘట్టంగా నిలిచింది.
ప్రస్తుతం అమన్ రావు హైదరాబాద్ జట్టు తరఫున అండర్-23 విభాగంలో రంజీ క్రికెట్ టోర్నీలో ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 160 స్ట్రైక్ రేట్‌తో రెండు అర్ధ శతకాలు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.
క్రికెట్ నేపథ్యం అమన్ రావు కుటుంబానికి ఉంది. ఆయన తండ్రి పేరాల మధుసూదన్‌రావు గతంలో కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టు సభ్యుడిగా జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. అమన్‌రావు తాత పేరాల గోపాల్‌రావు జిల్లా పరిషత్ గత పాలకవర్గంలో వైస్ ఛైర్మన్‌గా సేవలందించారు. వీరి స్వగ్రామం సైదాపూర్ మండలం వెన్నంపల్లి కాగా, గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. అమన్ రావు ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మేయర్ సునీల్‌రావు హర్షం వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!