కొండాపూర్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో ఓ డ్రగ్ పెడ్లర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల కొకైన్‌ను ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ చర్య ఈగల్ టీం మరియు గచ్చిబౌలి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా నిర్వహించబడింది.
పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా బెంగళూరు, గోవా నగరాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడైంది. జల్సాల కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా, డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!